Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ దేవర సినిమా చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ మూవీ సాధించిన విజయం పట్ల దేవర టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. నా కెరీర్లో అతిపెద్ద విజయం ఇదే అని తెలిపాడు.
ఈ సినిమా విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు మూడేళ్ల ప్రయాణమిది. మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సంబంధించి నిన్న రాత్రి నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయి. కాల్ చేసి అందరూ ఒకటే చెబుతున్నారు. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిలిం అంటున్నారు. దేవర టీం వలనే ఈ విజయం దక్కింది. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. అంటూ శివ చెప్పుకోచ్చాడు.
#Devara Success Press Meet#NandamuriKalyanram #KoratalaSiva #DilRaju pic.twitter.com/khruNKb7Eu
— Vamsi Kaka (@vamsikaka) September 27, 2024