Kajal Aggarwal Role in Acharya | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా, రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్లో కాజల్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. అంతేకాకుండా లేటెస్ట్గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా కాజల్ గురించి ఒక్కరు మాట్లాడలేదు. దాంతో గత రెండు రోజుల నుంచి ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా కొరటాల శివ వీటిపై స్పందించాడు.
కొరటాల శివ ఈ వార్తలపై స్పందిస్తూ ఆచార్య సినిమాలో వచ్చే ‘లాహే లాహే’ అనే పాట అమ్మ వారి మీద వచ్చే పాటని, ఇదొక ట్రూప్ వచ్చి ధర్మస్థలిలో చెప్పే పాటగా ఉంటుందని వెల్లడించాడు. ఈ పాటలో కాజల్ కనిపిస్తుందని చెప్పాడు. అయితే ఈ చిత్రంలో ఈమె పాత్రను కామెడీ యాంగీల్లో రాసుకున్నానని, 4రోజులు కాజల్‌పై షూట్‌ను కూడా జరిపానని తెలిపాడు. కానీ అవుట్ పుట్ చూసాకా తనకున్న ఇమేజ్‌కు ఈ పాత్ర కరెక్టు కాదని తన సీన్స్ ఎడిట్ చేశానని తెలిపాడు. ఈ విషయం కాజల్ కూడా చెప్పాడని, తను కూడా అర్థం చేసుకుని ఒకే అని చెప్పిందట. ఇక ఈ చిత్రంలో పూజాహెగ్డే మాత్రమే హీరోయిన్గా నటించినట్లు క్లారిటీ వచ్చింది. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ సంస్థతో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.