Ntr: కొరటాల, రాజమౌళితో ఎన్టీఆర్ గేమ్ షో.. వీడియో వైరల్

బుల్లితెర అయిన వెండితెర అయిన ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్నారు. ఈ షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై తెగ సందడి చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించే సరికి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయారు.
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. తారక్ ముందు హాట్ సీట్లో కూర్చొని ఆడబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు వదిలారు. ఇందులో దర్శకులు ఇద్దరు రోల్ కెమెరా, యాక్షన్ అని చెబుతుండగా, ఎన్టీఆర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అనంతరం ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది. నేనే బాస్ ఇక్కడ అంటూ ఎన్టీఆర్ డైలాగులు విసురుతున్నారు.
సెప్టెంబర్ 20న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా, ఇది మంచి టీఆర్పీ రాబట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు దర్శకులతో ఎన్టీఆర్‌కి మంచి బాండింగ్ ఉంది. రాజమౌళితో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేశాడు. కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ చేయగా ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక త్వరలోనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయనున్నాడు.
Can't Wait 😻😻
— Troll NTR Haters (@TrollNTRHaterzz) September 16, 2021
Next Week @tarak9999 🔥#EvaruMeeloKoteeswarulu#ManOfMassesNTR pic.twitter.com/SMuIn0uAGY
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

