Konidela Upasana | టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్‌కు చిరంజీవిని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకోగా.. వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవికి సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై మెగా కోడలు ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ కంగ్రాట్స్ మామయ్య అంటూ ట్వీట్ చేసింది. ”ఐదు బలమైన వేళ్ళు కలిస్తేనే బలమైన పిడికిలి అవుతుంది. మా అందరికి అయన సినిమాల్లోనే కాదు దాతృత్వంలో కూడా. జీవితంలో నాన్నగా, మామయ్యగా, తాతయ్యగా ఉంటారు. చిరుతని పద్మవిభూషణ్ తో సత్కరించారు” అంటూ ఉపాసన రాసుకోచ్చింది. దీనితో పాటు ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చిరంజీవి తన మనవరాల్లతో దిగిన ఫోటో ఉండగా.. ఇందులో సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల పిల్లలతో పాటు రామ్ చరణ్ కూతురు క్లింకార కూడా ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What you see are five fingers that form a powerful fist 👊 ❤️
Congrats to our inspiration, not just in cinema & philanthropy but in life – as a dad, father-in-law & granddad. Chirutha, honored with #PadmaVibhushan 🙏🙌 Love you 🥰 @KChiruTweets pic.twitter.com/3QHpuyPcxK— Upasana Konidela (@upasanakonidela) January 26, 2024