‘ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. జీవితంలో ఏదీ ప్లాన్ చేసి రాదు.. అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి.. అంతే..’ అంటున్నారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. తాజా సినిమా ‘బైసన్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా చెబుతూ ‘మంచి కథల్లో భాగం కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. గడిచిన పదేళ్లలో వినూత్న కథా చిత్రాల్లో నటించాను. అంతెందుకు.. ఈ ఒక్క ఏడాదిలోనే డ్రాగన్, జానకీ వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కింధపురి చిత్రాల్లో నటించాను. నాలుగూ వైవిధ్యమైన చిత్రాలే.
త్వరలో అయిదో సినిమా కూడా రానున్నది. అదే ‘బైసన్’. దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ‘పెరియేరుమ్ పేరుమాళ్’ సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను మిస్ చేసుకున్నా. చాలా నిరాశ చెందాను కూడా. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో ‘బైసన్’ చేసే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ‘ప్రేమమ్’ చేసేటప్పుడు సినిమా గురించి నాకస్సలు తెలీదు. పదేళ్ల తర్వాత ‘బైసన్’ ఫొటో షూట్ సమయంలోనూ అలాగే ఫీలయ్యా.’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.