K Bhagyaraj | కోలీవుడ్‌లో వరుస విషాదాలు: మొన్న భారతీరాజా.. నేడు ఆయన శిష్యుడు భాగ్యరాజా!
Kollywood | తమిళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణవార్త మరువకముందే, ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, దర్శక-రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు.
K Bhagyaraj | తమిళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణవార్త మరువకముందే, ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, దర్శక-రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. శనివారం (జూన్ 27) తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను హుటాహుటిన చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం (జూన్ 10న) భాగ్యరాజ్ గురువు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా వయోభారంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి తమిళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోకముందే, ఇప్పుడు భాగ్యరాజ్ కూడా ఆకస్మికంగా మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్.. తన సినీ ప్రయాణాన్ని భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయితగా ప్రారంభించారు. సామాన్య ప్రజల జీవితాలను, సున్నితమైన హాస్యాన్ని తన సినిమాల్లో అద్భుతంగా ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన పకడ్బందీ కథనాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో.. కోలీవుడ్‌లో ఆయన్ని “స్క్రీన్‌ప్లే కింగ్” అని పిలిచేవారు. ఇక తన కెరీర్లో 75కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, 25కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ముందానై ముడిచు’ (1983) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీతో కూడా అతడికి విడదీయని అనుబంధం ఉంది. పలు తెలుగు సినిమాలలో నటించిన ఆయన వెంకటేశ్ నటించిన అబ్బాయిగారు (1993) సినిమాకు కథను అందించాడు. ఇక భాగ్యరాజ్ మృతి పట్ల కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని నివాళులర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

