Ghani Movie | రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్న యువ నటుడు వరుణ్ తేజ్. ఈయన నటించిన సినిమాలలో ఏ ఒక్క చిత్రం కూడా ఒకే విధమైన కథతో ఉండవు. కథనే హీరోగా భావించే నటులలో వరుణ్ తేజ్ ఒకడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘గని’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమా పైన భారీ అంచానాలను నమోదు చేశాయి. తాజాగా ఈ చిత్రంలోని మిల్క్ బ్యూటీ తమన్నా నర్తించిన ‘కొడ్తే’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది. తమన్నా గ్రేసింగ్ స్టెప్స్, అందాల ఆరబోత యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రీ సాహీత్యాన్ని అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ద కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టీ, నవీన్ చంద్ర, జగపతిబాబు, నదియా కీలకపాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల మందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
R.R.R Business | ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్.. ‘బాహుబలి-2’కంటే 100కోట్లు ఎక్కువే సాధించాలి
Project-k movie | నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని మహాభారతం నుంచి స్పూర్తి తీసుకున్నాడా?
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?