మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది ‘కొదమసింహం’ (1990). ఆయన నటించిన ఒకే ఒక కౌబాయ్ చిత్రమిది. తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్ 21న రీరిలీజ్ చేస్తున్నారు. 4కేలో కన్వర్షన్ చేసి, సరికొత్త డిజిటల్ సౌండింగ్‌తో ఈ చిత్రాన్ని పునఃవిడుదల చేయబోతున్నామని రమా ఫిలింస్ నిర్మాత కైకాల నాగేశ్వరావు ఓ ప్రకటనలో తెలిపారు.
కె.మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనమ్, వాణీవిశ్వనాథ్ కథానాయికలుగా నటించారు. రాజ్‌కోటి సంగీతాన్నందించారు. ‘కొదమసింహం’ మరోమారు ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమని నిర్మాతలు పేర్కొన్నారు.