KL Rahul | పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’ తాజాగా టీం ఇండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్. రాహుల్ హృదయాన్ని గెలుచుకుంది. ఈ సినిమాను వీక్షించిన అనంతరం ఆయన తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. “ఈ మ్యాజిక్ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది… రిషబ్ శెట్టి మరోసారి అద్భుతాన్ని చేశాడు” అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే, ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని పేర్కొన్నారు. కర్ణాటకకు చెందిన రాహుల్‌కు ఈ సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలో తప్పేమి లేదు అని కొందరు అనుకుంటారు. కాని రాహుల్ తన అభిరుచుల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. బాలీవుడ్ సినిమాలపై, అంతేకాదు తెలుగు, తమిళ సినిమాలపై కూడా పాజిటివ్ కామెంట్స్ చేయడంలోను ముందుంటాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న కె.ఎల్. రాహుల్, ఓవైపు సెంచరీలు బాదుతూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుండగా, మరోవైపు తన ఫ్రీ టైంలో మంచి సినిమాలు చూసి ప్రశంసించడంలోనూ స్పెషల్ గా నిలుస్తున్నారు. గతంలో ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ వేసిన ‘తగ్గేదేలే’ మేనరిజం చాలామంది క్రికెటర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ల సమయంలో విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఆ స్టైల్‌ని ఫాలో అవుతూ పుష్ప మ్యానియా క్రికెట్ వరల్డ్‌లోనూ స్పష్టంగా కనిపించింది.
ఈ నేపథ్యంలో రాహుల్ లేటెస్ట్గా ‘కాంతారా చాప్టర్ 1’కు ఫిదా అవ్వడం చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ సినిమా మంచి విజయం సాధించేలా చేశాయి.. అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పాజిటివ్ వైబ్స్ అందిచింది . ఇప్పుడు రాహుల్ కామెంట్ వల్ల ఇంకా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీల ఆసక్తి ఈ సినిమాపై పెరగడం ఖాయం. ఇప్పటికే సినిమాలోని విజువల్స్, మ్యూజిక్, డివోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా డైలాగ్స్, మ్యూజిక్ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి… కాంతారా మ్యాజిక్ క్రికెట్ ఫీల్డ్‌ను కూడా తాకినట్టే. కె.ఎల్. రాహుల్ లాంటి స్టార్ నుంచి వచ్చిన కామెంట్స్, కాంతారా చాప్టర్ 1 మరింతగా ప్రేక్షకుల మన్ననలు పొందే దిశగా దూసుకుపోయేలా చేయడం ఖాయం.