Kisi ka Bhai Kisi Ki Jaan Movie | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దాంతో అభిమానులు చిత్రబృందం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా సల్లూ భాయ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు.
ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌డే కానుకగా ఒకరోజు ముందే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ ప్రకటనతో సల్మాన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ అగ్ర నటుడు వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తు్న్నాడు.
#KisiKaBhaiKisiKiJaan Teaser ab dekho bade parde par on 25th Jan…@VenkyMama @hegdepooja @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii #VinaliBhatnagar @farhad_samji @ShamiraahN pic.twitter.com/pbVSce3xYH
— Salman Khan (@BeingSalmanKhan) January 23, 2023