Kisi ka Bhai Kisi ki jaan Movie Songs | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండేళ్లలో సల్మాన్ నుంచి రెండు సినిమాలు రాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ఓ బల్లే బల్లే అంటూ సాగే హుషారైనా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సల్మాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. అంతేకాకుండా ఈ పాటకు థియేటర్లో ప్రేక్షకులు ఈలలు గోలలతో రచ్చ చేయం ఖాయం. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాట కూడా జనాలకు ఇన్స్టాంగ్గా ఎక్కేస్తుంది. సుఖ్బీర్ స్వరపరిచిన పాటను ఆయనే స్వయంగా ఆలపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మాలయాళంలో సూపర్ హిట్టయిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇదే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడిగా రీమేక్ చేశాడు.
ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. టీజర్, ట్రైలర్లను గమనిస్తే తెలుగు నెటివిటీని కాస్త ఎక్కువగానే దట్టించినట్లు తెలుస్తుంది. మరీ హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు.