మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సమర్పణలో కిశోర్ మారిశెట్టి నిర్మించిన చిత్రం ‘ఇల్లు’. రోహిత్, శశి దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ప్రధాన పాత్రలు. ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్ కథాసుధలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమాలో నటించడం పట్ల నటి బిందు చంద్రమౌళి, నటుడు అనీష్ కురువిల్ల ఆనందం వెలిబుచ్చారు. ఇది చాలా పద్ధతిగా చేసిన సినిమా అని, ఒక చిన్న కథను సంగీతం తోడుగా ప్రేక్షకులకు చేర్చడం ఒక ప్రత్యేకమైన అనుభవమని దర్శకుడు రోహిత్ అభిప్రాయపడ్డారు. కొత్త కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని, ఈ సినిమాకు పనిచేసిన ఇద్దరు దర్శకుల శైలి నాకు నచ్చిందని, వివేక్ సాగర్ సంగీతం కొత్త అనుభూతినిస్తుందని నిర్మాత కిశోర్ మారిశెట్టి తెలిపారు.