Kishkindapuri Movie | హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని జీ 5 సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు తప్పకుండా ఓటిటిలో ట్రై చేయవచ్చు. రాక్షసుడు చిత్రం తర్వాత పెద్ద హిట్ లేని బెల్లంకొండకి ఈ చిత్రం ఊరట ఇచ్చింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ హర్రర్-థ్రిల్లర్ చిత్రం, థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హీరో రాఘవ్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ , హీరోయిన్ మైథిలి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలు పోషించారు. మామూలు కథను థ్రిల్‌గా మార్చే స్క్రీన్‌ప్లే, అనుపమ పరమేశ్వరన్ ప్రదర్శించిన నటన సినిమాను ప్రత్యేకంగా నిలిపింది.
సినిమా కథ విషయానికి వస్తే.. ఘోస్ట్ వాకింగ్ అనే పేరుతో థ్రిల్ ను కోరుకునే వారి కోసం లేని దెయ్యాలను ఉన్నాయని నమ్మిస్తూ ఘోస్ట్ హౌసెస్ లోకి టూర్లు కండక్ట్ చేస్తుంటారు హీరో ( పాత్ర పేరు రాఘవ), హీరోయిన్లు ( హీరోయిన్ పాత్ర పేరు మైథిలి). ఈ క్రమంలో కిష్కిందపురి అనే ఒక ఊరికి 11 మంది బ్యాచ్ తో కలిసి సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కు వెళ్తారు. అక్కడనుండి కథ మలుపు తీసుకోవడంతో మూవీ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. దెయ్యంలా మారిన వేదవతి ఎవరు. ఎందుకు అందరిని చంపాలనుకుంటుంది. వీరితో పాటు వెళ్లిన చిన్న పిల్లను కాపాడటానికి ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా హీరో ఏమి చేసాడు అనేది చిత్ర కథ.
థియేటర్స్ లో బాగానే ఆడిన ‘కిష్కిందపురి’ ఓటీటీలో ఎలాంటి విజయం అందుకుంటుందా అనేది చూడాలి. హర్రర్-థ్రిల్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’లో నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్ గా నటించాడు. ఈ చిత్రంలో అతని నటనకి ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు వచ్చాయి.