కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. త్వరలోనే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా మలయాళ వెర్షన్‌ని హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిల్మ్స్ సంస్థ ద్వారా విడుదల చేయబోతుండటం విశేషం. సోమవారం ఈ సినిమా నుంచి జాతర నేపథ్యంలో సాగే మాస్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పునకమై ఆడు..’ అంటూ సాగే ఈ పాటను సనాపాటి భరద్వాజ్ రాయగా, సామ్ సీఎస్ స్వరపరచి, దివాకర్, అభిషేక్ ఏఆర్‌తో కలిసి ఆలపించారు. పొలాకి విజయ్ కొరియోగ్రఫీ అందించారు.
ఈ పాటలో కిరణ్ అబ్బవరం స్టెప్పులు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. కథానాయికలు తన్వీరామ్, నయన్ సారిక కూడా ఈ పాటలో నర్తించారని, ఈ పాటతో థియేటర్లన్నీ జాతరని తలపిస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డానియేల్, సతీష్‌రెడ్డి మాసం, సమర్పణ: చింతా వరలక్ష్మి, నిర్మాణం: శ్రీచక్రాస్ ఎంటైర్టెన్మెంట్స్.