కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివం సెల్యూలాయిడ్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, నిర్మాతలు డి.సురేష్‌బాబు, ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కిరణ్ అబ్బవరం పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డానియేల్, సంగీతం: సామ్ సీఎస్, సహనిర్మాతలు: బి.సురేష్ రెడ్డి, సంతోష్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, దర్శకత్వం: విశ్వకరుణ్.