కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కశ్మీర పరదేశి తండ్రి పాత్రలో సీనియర్ యాక్టర్ మురళీ శర్మ నటిస్తున్నాడు.
టీజర్లో ఈ సినిమా కథేంటో అని రౌడీ గ్యాంగ్ అడుగుతుంటే.. కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చని కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. టీజర్లో కిరణ్ అబ్బవరం సస్పెన్స్ లో పెడుతూ చెప్పిన ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం.. అన్నా అని రౌడీ గ్యాంగ్ అడుగుతున్న డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్.
మనకు కష్టమొస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. పక్కనోళ్లు చేస్తే చాలు. ఎవరికి తెలుసు. నీ పక్క నంబర్ ఏ సీఎంతో, పీఎందో, సచిన్దో, ధోనిదో, పవర్‌స్టార్, ఐకాన్ స్టార్ రెబల్ స్టార్‌ది కూడా అయ్యుండొచ్చు. అలాంటి వారికి ఒక్కరికి ఈ వీడియో చేరినా నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని అంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ క్యూరియాసిటీ పెంచుతోంది ట్రైలర్.
మురళీ కిషోర్ అబ్బురూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్..
Experience a new "Neighbouring" concept packed with Love, Action & Thrills🔥#VinaroBhagyamuVishnuKatha Trailer Out Now 🤩
▶️ https://t.co/HJbhXlQT6U #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #VBVKTrailer #VBVKonFEB17th pic.twitter.com/b5v7UNqdpq— GA2 Pictures (@GA2Official) February 7, 2023
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..