‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా టీజర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ టీజర్ లాంఛ్ వాయిదా పడ్డది. మంగళవారం టీజర్ లాంఛ్ కానుంది. ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం వీడియో ద్వారా తెలియజేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల వైకుంఠపురంలో మూవీ లవర్స్ కు మా టీం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అంటూ కిరణ్ అబ్బవరం షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. నిర్మాత బన్నీవాసు, కిరణ్ అబ్బవరం టీం బ్యాంకాక్ వెళ్లారు. ఇంతకీ కిరణ్ అబ్బవరం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కశ్మీర పరదేశి హీరోయిన్గా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Small delay in the teaser but we will make your wait worthy ☺️
'Allu arjun'gari fans and 'Ala vaikuntapuram'fans we have a surprise for you 😍
Teaser from 10th jan 10:30am #VBVKTeaser #VinaroBhagyamuVishnuKatha #vbvk pic.twitter.com/98PBqHtfXm
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 8, 2023
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..