Kiran Abbavaram | టాలీవుడ్ సినీ నటుడు కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. తన కొత్త సినిమా కే ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజ హీరోయిన్గా నటిస్తోంది. వీకే నరేష్, వెన్నెల కిషోర్, సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.