“క’ అంటే ఏంటి? అసలు కథేంటి? ఈ ప్రశ్నలకు ఈ సినిమా ైక్లెమాక్స్ సమాధానం ఇస్తుంది. ఇలాంటి కథ, ఇటువంటి ైక్లెమాక్స్ ఇంతకుముందు చూసుండరు. అందుకే.. సినిమా చూసి మీరు కొత్తగా ఫీల్ కాకుంటే సినిమాలు చేయడం మానేస్తానని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను.’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన హీరోగా రూపొందిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘క’. నయన్సారిక, తన్వీరామ్ హీరోయిన్లు. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం కిరణ్ అబ్బవరం విలేకరులతో ముచ్చటించారు. ‘నిజానికి ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఎవరు? ఏంటి? ఎక్కడ? అనే సస్పెన్స్‌తో కథ సాగుతుంది. 1977లో కృష్ణగిరి అనే ఊరిలో పనిచేసే పోస్ట్‌మ్యాన్ అభినయ వాసుదేవ్‌గా నేను కనిపిస్తా. రియలిస్టిక్‌గా వచ్చేందుకు ఇందులోని యాక్షన్ సీన్స్ చాలా వరకూ డూప్ లేకుండా చేశాను. దర్శకులు సుజీత్, సందీప్ చాలా క్లారిటీగా, డెడికేషన్‌తో సినిమా చేశారు. ఎక్కడ్నుంచీ రిఫరెన్స్ తీసుకోకుండా కొత్తగా ట్రై చేశారు. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్‌కి ప్లాన్ చేశాం. తమిళ సినిమాలు రిలీజులు ఎక్కువ ఉండటంతో తమిళనాడు థియేటర్లు దొరకలేదు. మలయాళంలో దుల్కర్ ‘లక్కీభాస్కర్’ విడుదల అదే రోజు ఉంది. ఆయనే మా సినిమా కూడా మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. అందుకే.. ఒకే ప్రొడక్షన్ నుంచి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం కరెక్ట్ కాదని మలయాళంలో రిలీజ్ ఆపాం’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు.