Kiran abbavaram |వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం . తాజాగా ఈయన నటించిన చిత్రం సెబాస్టియన్ పి.సి 524. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. రేచీకటి ఉన్న కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ నటించనున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రాజావారు రాణిగారు, SR కళ్యాణమండపం వంటి వరుస హిట్ల తర్వాత ఈ చిత్రం రాబోతుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. సెబాస్టియన్ సినిమా కాన్సెప్ట్ పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉందని వెల్లడించాడు. ఎలైట్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై ప్రమోద్ రాజు, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్‌కు జోడిగా నువేక్ష, కోమలిప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.