కిరణ్ అబ్బవరం, చాందినీ జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’.గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కె.ప్రవీణ నిర్మిస్నున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో కిరణ్ అబ్బవరం జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు ఈ చిత్రానికి బలంగా నిలుస్తాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర.