Kiran Abbavaram – Rahasya Gorak | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)లు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంత కాలంగా ఈ జంట ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. అయితే తెలుగు సంప్రదాయ ప్రకారం గురువారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అంటూ రాసుకోచ్చాడు. ఇక అభిమానులతో పాటు, సినీ ప్రియులు నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇద్దరు కలకాలం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు.
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది.
We Need all your blessings ❤️🙏 pic.twitter.com/3ibTFUuJp0
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024