Kiran Abbavaram | టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు. ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన కిరణ్ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అతడు నటించిన చివరి చిత్రం రూల్స్ రంజన్. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కిరణ్.
అయితే చాలా రోజులకు తన కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు కిరణ్. ఈ సారి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రూ.20 కోట్లు బడ్జెట్ అని సమాచారం. ఇద్దరు దర్శకులు దర్శకత్వం చేయబోతున్న ఈ చిత్రానికి కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ను జూలై 09న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్లో అభినయ వాస్దేవ్ అనే వ్యక్తి.. కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ దీపాల పద్మనాభం గారికి వ్రాయునది అంటూ పోస్టర్లో కనిపిస్తుంది.
This one ❤️🔥 pic.twitter.com/YnUYvFQck4
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 7, 2024