యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకద్వయం సుజీత్, సందీప్ సోషల్మీడియా ద్వారా సినిమా విశేషాలను పంచుకున్నారు. తమ కెరీర్లో ఇదొక మెమొరబుల్ మూవీ అని పేర్కొన్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. కథలోని మలుపులు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. పీరియాడిక్ ఇతివృత్తంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది. ఈ చిత్ర మలయాళ థియేట్రికల్ హక్కులను అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు’ అని తెలిపారు. నయన్సారిక, తన్వీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సంగీతం: సామ్ సీఎస్, దర్శకత్వం: సుజీత్, సందీప్.