Kiran Abbavaram | తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది ‘క’ (KA Movie) చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ‘క’ ప్రస్తుతం రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ సందర్భంగా చిత్రయూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో కిరణ్ మాట్లాడూతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా మంచి టాక్‌తో ఈ సినిమా నడుస్తుంది అని తెలిపారు. ఈ సినిమా సక్సెస్ కాకపోతే సినిమాలు మానేస్తా అన్నారు. నిజంగానే అదే చేసేవారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిరణ్ సమాధానమిస్తూ.. నేను మాట మీద నిలబడే మనిషిని. ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే కచ్చితంగా సినిమాలు వదిలేసి వెళ్లేవాడిని అంటూ కిరణ్ చెప్పుకోచ్చాడు.