Kiran Abbavaram | టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క’ (KA). ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 5.01 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నయన్ సారిక ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మాన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Kotha Modaledama … 🔥#KA #KAonOCT31st pic.twitter.com/6zVhZY4gOy
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 23, 2024