యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ‘మాస్ జాతర’ అనే పాటను ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు. సామ్ సీ సంగీతాన్నందించిన ఈ పాట హుషారెత్తించే బీట్తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. దర్శకులు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్ర మలయాళ థియేట్రికల్ హక్కులను అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు’ అని తెలిపారు. నయన్సారిక, తన్వీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సంగీతం: సామ్ సీఎస్, దర్శకత్వం: సుజీత్, సందీప్.