కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా ‘క’. సుజీత్, సందీప్ ద్వయం దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించిందనీ, 50కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, ఓవర్సీస్లోనూ ‘క’ వసూళ్లు బావున్నాయని మేకర్స్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ నెల 22న ఈ సినిమా మలయాళంలో విడుదల కానుంది. అగ్రహీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.