కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. సంజన ఆనంద్ నాయిక. దివ్య దీప్తి నిర్మాత. ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నటుడు బాబా భాస్కర్ మాట్లాడుతూ…‘సినిమా అంటే నాకు ఇష్టం.
అది కొరియోగ్రాఫర్గానా, నటుడిగానా అనేది పట్టించుకోను. ఈ చిత్రంలో నాకు మంచి క్యారెక్టర్ ఉందని చెప్పారు. నేను నటించగలనా అని సందేహించాను. ఈ క్యారెక్టర్ మీకు సరిపోయేలా ఉంటుందని దర్శకుడు, హీరో చెప్పారు. వాళ్లు పెట్టుకున్న నమ్మకంతోనే ఒప్పుకుని నటించాను. నేను బయట, టీవీ కార్యక్రమాల్లో ఎలా ఉంటానో ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.