Kiran Abbavaram | ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే క సినిమాకి సీక్వెల్ తీసే పనిలో ఉన్న కిరణ్ మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’ (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా.. జనవరి 03న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
Love is the world’s most addictive drug—experience it like never before this February. Stay tuned! #Dilruba teaser on 3rd Jan!#KA10 @Kiran_Abbavaram @RuksharDhillon @Vishwakarun5 @davisonNazia @SamCSmusic @saregamasouth @YoodleeFilms @SivamCelluloids #Ravi @Jojo__Jose… pic.twitter.com/xGyJENoAlc
— BA Raju’s Team (@baraju_SuperHit) December 29, 2024