‘ఈ సినిమాలో నేను చేసిన సిద్ధార్థ్ క్యారెక్టర్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉండే క్యారెక్టర్ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుంది. దర్శకుడు కరుణ్ కథ ఎంత అద్భుతంగా చెప్పాడో, అంత గొప్పగా తీశాడు. ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నాం. దర్శకుడు కరుణ్ కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. ఇది వినోదంతో సాగే ఇంటెన్స్ లవ్‌స్టోరీ. ‘క’ తర్వాత వస్తున్న ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుంది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. విశ్వ కరుణ్ దర్శకుడు. రవి, జోజో సోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఇందులో కొత్త కిరణ్ అబ్బవరాన్ని చూస్తారని నిర్మాతలు తెలిపారు. అందరి జీవితాల్లోని ప్రేమను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా రూపొందించానని, కిరణ్ అబ్బవరం సహకారం వల్లే ఈ సినిమా చేయగలిగానని దర్శకుడు చెప్పారు.