Kiran Abbavaram | ‘క’ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడమే కాకుండా.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు కిరణ్.
ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’ (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఫస్ట్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. అతడి కోపం.. అతడి ప్రేమ.. ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది అంటూ ఉన్న ఈ పోస్టర్లో కిరణ్ మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది
His love ❤️ His anger🔥
DILRUBA – Feb 2025 #Sivamcelluloids #Saregama #Yoodlefilms #Dilruba #KA10 pic.twitter.com/Az7ZlhcLHT
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 19, 2024