Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం రాజావారు రాణివారు. ఆ తరువాత పలు చిత్రాలలో నటించినా కూడా పెద్దగా విజయం సాధించలేదు. అతను నటించిన `ఎస్.ఆర్ కళ్యాణ మండంపం ఓ మోస్తారుగా ఆడింది. ఈ రెండు సినిమాలు మినహా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు అయితే ఇప్పుడు తాజాగా కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా `క అనే సినిమాతో రాబోతుంది.
ఇటీవలే ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కానీ అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్‌గా కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మంచి బజ్నే క్రియేట్ చేసింది. అయితే వరుస ఫ్లాపులతో మార్కెట్ లేని హీరో కిరణ్‌తో ఇంత బడ్జెట్ ఖర్చుపెట్టి సినిమా తీయడం ఎంతవరకు సేఫ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న హీరోల సినిమాలను థియేటర్లకు వచ్చి ప్రేక్షకుల చూస్తున్నారా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలు రిలీజై మంచి టాక్ వచ్చిన ఒక్కొసారి బాక్సాఫీస్ వసూళ్లు మాత్రం డల్‌గానే వుంటున్నాయి. అయితే పెద్ద సినిమాలు మినహా చిన్న సినిమాలను అందరు దాదాపుగా ఓటీటీ ద్వారా చూడడానికే ఇష్టపడుతున్నారు. కానీ కొంత మంది ‘క’ సినిమాకు చాలా క్రేజీ ఆఫర్స్ వచ్చాయని 12 కోట్ల బిజినెస్ అయ్యిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీడెడ్ హక్కులు అత్యంత ఫ్యాన్సీ రేట్ వచ్చిందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అని తెలియాల్సివుంది. మరికొంత మంది ఇది కూడా పబ్లిసిటి మార్కెట్ స్ట్రాటజీ అంటున్నారు.. ఏది ఏమైనా ఈ సినిమాతో నైనా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాలని ఆశిద్దాం.