Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Post Poned | ఫలితం ఎలా ఉన్నా వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి న ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచిన ఇటీవలే వచ్చిన ‘సమ్మతమే’ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాన్ని వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తూ సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. అయితే సెప్టెంబర్ 9న శర్వానంద్ ఒకే ఒక జీవితం, రణ్బీర్ కపూర్ బ్రహ్మస్త్ర విడుదల కానున్నాయి. అదే రోజున రెండు సినిమాలతో క్లాష్ ఎందుకుని భావించి నేను మీకు బాగా కావాల్సిన వాడిని మేకర్స్ వారం రోజులు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Just time difference anthe, Mass & Entertainment mathram pakka 👍🏻#NenuMeekuBaagaKavalsinavaadini Worldwide Grand Release on Sept 16th! 🔥#NMBK #NMBKOnSep16th@Kiran_Abbavaram @itssanjanaanand #SonuThakur #Manisharma @kodidivya @sridhar_chotu @KodiDivyaaEnt @LahariMusic pic.twitter.com/RuiFLOdUMt
— KodiDivyaaEntertainments (@KodiDivyaaEnt) September 3, 2022