Tejaswi Madivada | యంగ్ అండ్ టాలెంటెడ్ నటి తేజస్వి మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేశ్ బాబు – విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మహేశ్ బాబుతో ‘ఒక్కసారి ఇంకోసారి’ అంటూ చెప్పిన డైలాగ్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత చాలా తెలుగు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది తేజస్విని .
తేజస్విని హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది తేజస్వి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ రాబోతుండగా దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తేజస్వి.. రోహిత్ భరద్వాజ్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ తన ఫ్యామిలీ గురించి చెప్పి కంట కన్నీరు పెట్టుకుంది.
మా అమ్మ పదేళ్లకే చనిపోగా, మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు .దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. నన్ను అప్పట్నుంచి ఈ రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీనే చూసుకుంటుంది. వీళ్ళు నాకు లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతా అన్నారు. నాకు వీళ్ళే ఫ్యామిలీ. నేను ఎప్పుడూ జనాల్లోనే ఉండటానికి ఇష్టపడతాను. నాకు ఎప్పుడూ ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను షూటింగ్ సెట్ కి వచ్చి ఇక్కడ జనాలని చూస్తే నాకు పండగలా ఉంటుంది అంటూ ఏడ్చేసింది. తేజస్వి మాటలకి అనసూయ కూడా ఎమోషనల్ అయింది.