Tabu Nagarjuna | కుబేర, కూలీ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన స్టార్ నటుడు అక్కినేని నాగార్జున తన కెరీర్లో 100వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన సీనియర్ నటి టబు కనిపించబోతుందని వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 27 ఏండ్ల తర్వాత వీరిద్దరి కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో వీరిద్దరూ కలిసి ఇంతకుముందు ‘నిన్నే పెళ్ళాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాల్లో జోడీగా నటించారు. అలాగే సిసింద్రి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. అయితే చాలా ఏండ్లుగా టాలీవుడ్‌కి దూరంగా ఉంటూ వస్తున్న టబు నాగార్జున 100వ చిత్రంలో భాగం కాబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ఆకాశం దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది.