Kingdom | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఎంత కష్టపడి వర్క్ చేసిన కూడా విజయం అనేది వరించడం లేదు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఈరోజు గ్రాండ్‌గా విడుదలైంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ తర్వాత తెరకెక్కించిన ఈ పీరియడ్ డ్రామా, ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేపింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు.
ప్రీమియర్ షోల నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కథ నెమ్మదిగా మొదలవుతూ బ్రిటిష్ కాలం నాటి అంబియన్స్‌ను సమర్ధవంతంగా చూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. మొదటి 30 నిమిషాల్లోనే దర్శకుడు ప్రేక్షకులను సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ తన నటనతో ప్రతీ ఫ్రేమ్‌లో ఆకట్టుకుంటున్నాడని నెటిజన్లు అంటున్నారు. గత సినిమాల కంటే మేచ్యూర్డ్ యాక్టింగ్‌తో, బాడీ లాంగ్వేజ్‌లో వైవిధ్యమైన మార్పులు చూపిస్తూ ఆకట్టుకున్నాడని అంటున్నారు.
అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి మంచి మార్కులు పడుతున్నాయి. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ క్లాస్ గా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సత్యదేవ్ – విజయ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయట. ఏదేమైనా, సినిమా నిడివి కొద్దిగా ఎక్కువగా అనిపించడమే కాక, నరేషన్ కాస్త నెమ్మదిగా సాగినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కథ మంచిగా ఉన్నా స్క్రీన్‌ప్లే విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లోని బోట్ సీన్, ఎమోషనల్ హై పాయింట్స్ సినిమా బలంగా నిలుస్తున్నాయి. మొత్తంగా ‘కింగ్డమ్’ సినిమాతో విజయ్ దేవరకొండ ఫామ్‌కి తిరిగొచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వచ్చిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాపుల తర్వాత, ఈ మూవీ విజయ్ కి సాలిడ్ కంబ్యాక్ అవుతుందన్న ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం మెయిన్ హైలైట్స్ .. కథ, విజయ్ పర్ఫార్మెన్స్, అనిరుద్ మ్యూజిక్, డ్రా బ్యాక్స్: నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, లెన్త్, మొత్తంగా కింగ్డమ్ విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్ ఇచ్చే పీరియడ్ డ్రామా.