Kingdom | ఈ ఏడాది సెకండాఫ్‌లో పెద్ద సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిది. ఇక ఇప్పుడు ‘రౌడీ బాయ్’ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్స జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విడుదల దగ్గరపడటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి స్పందన రాగా, శనివారం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ట్రైలర్ ఈవెంట్ తిరుపతిలో జరుగుతుంది.
రీసెంట్గా విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా మారారు. ఈ ఇంటర్వ్యూను శుక్రవారం విడుదల చేశారు. అందులో సందీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు. సుమారు 45 నిమిషాలపాటు సినిమా చూసినట్టు చెప్పిన సందీప్.. ఆర్ఆర్ లేకపోయినా బాగా కనెక్ట్ అయ్యానని చెప్పారు. “సినిమా చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదనే విషయం కూడా మర్చిపోయా. అంతగా సినిమాలో లీనమయ్యాను” అని చెప్పారు. అనిరుథ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉందని, ఆర్ఆర్ అద్భుతంగా ఉండబోతుందన్నారు.
విజయ్ దేవరకొండ “పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్” ఇచ్చాడని, గౌతమ్ “సూపర్ హిట్ కొట్టాడని” ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మాడ్‌గా ఉంది, వేరే లెవల్ అనిపించింది అంటూ హైప్‌ను మరింతగా పెంచారు. సినిమాలో విజయ్ దేవరకొండ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని, ఆయన లుక్స్ కూడా అదిరిపోయాయని చెప్పారు. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే సందీప్ విజయ్‌కు ఫోన్ చేసి లుక్ అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది అన్నాడట. ఆయన మాటలని బట్టి చూస్తే.. సినిమా మంచి స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఏది ఏమైన సందీప్ రెడ్డి వంగా పాజిటివ్ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండకి ఇది మరో బ్లాక్‌బస్టర్ అవుతుందా? ఆయన స్థాయిని మరోసారి రుజువు చేసే సినిమా అవుతుందా? అన్నది చూడాలి.