Kingdom | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి కొన్నాళ్లుగా సరైన హిట్స్ రావడం లేదు. ఆయన ఎన్నో ఆశలతో కింగ్డమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. థియేటర్లలో జులై 31న విడుదలైన చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 27 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని ప్లాట్‌ఫారమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేయోచ్చు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కానిస్టేబుల్‌గా కనిపిస్తారు. కుటుంబానికి దూరమైన తన అన్న శివ్ (సత్యదేవ్) కోసం ఓ రహస్య మిషన్‌లో పాల్గొనే సూరి కథే సినిమా ప్రాణం. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. కథ విషయానికి వస్తే కానిస్టేబుల్ సూరి (విజయ్ దేవరకొండ), తన చిన్నతనంలో విడిపోయిన అన్న శివ్‌ను వెతుక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలో కొందరు అధికారులతో కలహం ఏర్పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా అతనికి ఓ అత్యంత కీలక గూఢచారి మిషన్ అప్పగించబడుతుంది.
శివ్ శ్రీలంక సమీపంలోని ‘దివి’ అనే ద్వీపంలో ఉన్నాడని తెలుసుకుని, సూరి అక్కడికి ప్రయాణిస్తాడు. అక్కడ ఎదురయ్యే పరిస్థితులు, 70 ఏళ్లుగా దాచిన రహస్యాలు , అన్నతో కలిసి చేసిన పోరాటం ప్రేక్షకులను థ్రిల్ కలిగిస్తాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ వినూత్న పాత్రలో కనిపించి సందడి చేశాడు. సత్యదేవ్ కూడా అబ్బురపరిచే నటనా ప్రదర్శన కనబరిచాడు. గొప్ప విజువల్స్, బలమైన నేపథ్య సంగీతం, సస్పెన్స్, ఎమోషన్, యాక్షన్ మేళవించిన కథ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాను థియేటర్లో మిస్ అయిపోయినవాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ భాషలతో పాటుగా.. హిందీలో ‘సామ్రాజ్య’ అనే పేరుతో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.