King Of Kotha | దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లాంఛ్ వాయిదా.. కారణమిదే..!
King Of Kotha | మలయాళ నటుడు హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha). మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ (King Of Kotha Trailer)ను ఇవాళ విడుదల కావాల్సింది.
King Of Kotha | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు మలయాళ నటుడు హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha). అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ (King Of Kotha Trailer)ను ఇవాళ విడుదల కావాల్సింది. అయితే పాపులర్ మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దిఖీ మరణంతో ట్రైలర్ లాంఛింగ్‌ను వాయిదా వేశారు. సిద్దిఖీ సార్ ఆకస్మిక మరణంతో కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లాంఛ్ వాయిదా వేశాం. సిద్దిఖీ సార్ కుటుంబసభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లోడింగ్.. బ్లాస్టింగ్‌కు రెడీనా..? అంటూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారనే డైలాగ్స్‌తో షురూ అయిన టీజర్లో తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కింగ్ ఆఫ్ కోట చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఓనమ్ 2023 కానుకగా విడుదల చేయనున్నారు.
— Wayfarer Films (@DQsWayfarerFilm) August 8, 2023
కింగ్ ఆఫ్ కోట టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

