King Of Kotha Movie | ఓకే బంగారం, మహానటి, సీతారామం వంటి సినిమాలతో తెలుగులో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దుల్కర్. తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు సమానంగా దుల్కర్ సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంది. దుల్కర్ కూడా నేరుగా తెలుగు దర్శకులతో చేతులు కలుపుతూ మార్కెట్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇటీవలే దుల్కర్ కింగ్ ఆఫ్ కొత్త అంటూ ప్రేక్షకులను పలకరించాడు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో రిలీజైన ఈ సినిమా తొలి రోజు నుంచి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
ఈ సినిమా హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. సెప్టెంబర్ 29నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక దుల్కర్ ప్రస్తుతం వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూ న్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది.