King Of Kotha Movie | ఓకే బంగారం, మహానటి, సీతారామం వంటి సినిమాలతో తెలుగులో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దుల్కర్. తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు సమానంగా దుల్కర్ సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంది.
‘నేను ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించాను. లవర్‌బాయ్ అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. అయితే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా వినూత్నమైన పాత్రల్లో కనిపించాల నుకుంటున్నా.