Dulquer Salmaan | సరికొత్త ఇమేజ్ను తీసుకొస్తుంది
‘నేను ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించాను. లవర్‌బాయ్ అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. అయితే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా వినూత్నమైన పాత్రల్లో కనిపించాల నుకుంటున్నా.
‘నేను ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించాను. లవర్‌బాయ్ అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. అయితే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా వినూత్నమైన పాత్రల్లో కనిపించాలనుకుంటున్నా. అందులో భాగంగానే ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా చేశాను’ అన్నారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా అభిషేక్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న సంగతులు.
నేను ఇప్పటివరకు గ్యాంగ్‌స్టర్ సినిమా చేయలేదు. అందుకే నా కెరీర్లో ప్రత్యేకంగా భావిస్తున్నా. ‘కింగ్ ఆఫ్ కొత్త’ టైటిల్లో కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అందుకే తెలుగు డబ్బింగ్లో కొంచెం భిన్నమైన శబ్దం వినిపించాలని ‘కోత’ అని చెప్పాం. కోత అనే ఊహాత్మక పట్టణంలో జరిగే కథ ఇది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో స్నేహం, ప్రేమ అంశాలతో పాటు పాత్రల మధ్య సంఘర్షణ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ కథ రెండు విభిన్న కాలాల్లో జరుగుతుంది. తెలుగు వెర్షన్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను. నా దృష్టిలో ప్రతీ భాషకు ఓ ప్రత్యేకమైన సొగసు ఉంటుంది. తెలుగులో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని ఎలాంటి దోషాలు లేకుండా డబ్బింగ్ చెప్పాను.
తెలుగు స్ట్రెయిట్ సినిమాకే ప్రాధాన్యత
నేను సాధారణంగా ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ ఈ ఒక్క సినిమా కోసమే దాదాపు ఏడాది శ్రమించాను. ఇందులో ఫుట్‌బాల్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ధృవ్ అనే కొరియోగ్రాఫర్ ఆ సన్నివేశాలను అద్భుతంగా డిజైన్ చేశాడు. పీరియాడిక్ సినిమా కావడంతో ఆర్ట్ వర్క్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. విజువల్‌గా ఈ సినిమా కొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రతీ పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు చేయడం నాకు ఇష్టం. ‘సీతారామం’ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.
అందుకే ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టా
ఈ సినిమా నిర్మాణంలో నేనూ భాగమయ్యా. మలయాళంలో కొన్ని సినిమాల విషయంలో నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏవో కారణాలు చూపిస్తూ కొందరు నిర్మాతలు సరైన బడ్జెట్‌ను సమకూర్చలేకపోయేవారు. మంచి సినిమాను కాపాడుకోవాలంటే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే వేఫేరర్ ఫిల్మ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఆరంభించాను. ‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో నేను నటించబోతున్నానని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయం గురించి నేను స్పందించను. ఆ చిత్ర నిర్మాతలే సమాధానం చెబుతారు (నవ్వుతారు). అయితే ‘ప్రాజెక్ట్-కె’ అద్భుతమైన కథ. భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చే సత్తా ఆ చిత్రానికి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

