Akkineni Nagarjuna | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ “లెనిన్”. ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాను ముందుగా జూన్‌లోనే విడుదల చేద్దామనుకుంటే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా విడుదల తేదీ ప్రకటించడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రాజెక్ట్‌ను అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు.
ఇక తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ సినిమా ఆలస్యం కావడంపై నాగార్జున చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా సినిమా ఆలస్యమైతే ఓటీటీ బిజినెస్ లెక్కలు మారిపోతాయని, కానీ ‘లెనిన్’ విషయంలో అలాంటిదేమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఈ సినిమాను కేవలం ఓటీటీ మార్కెట్ కోసమో, లాభాల కోసమో నిర్మించలేదని నాగ్ పేర్కొన్నారు. సినిమా లేట్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. తాము ఎప్పుడూ ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తామని, ముందుగా కంటెంట్ తమకు నచ్చితేనే కదా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని అన్నారు. తమకు నచ్చని అవుట్‌పుట్‌తో సినిమాను థియేటర్లలోకి తెచ్చి ప్రేక్షకులను నిరాశపరచడం ఇష్టం లేకే ఇంత సమయం తీసుకున్నట్లు వివరించారు. నిజానికి ఈ సినిమా జూన్‌లోనే విడుదల కావాల్సి ఉందని, అయితే టెక్నికల్‌గా ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడం కోసం చిత్ర బృందం మరో రెండు వారాల సమయం అడగడంతో జూన్ నుండి జులైకి వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం సినిమా వచ్చిన విధానంపై తామంతా పూర్తి సంతృప్తిగా, సంతోషంగా ఉన్నామని నాగార్జున నమ్మకంగా వెల్లడించారు.