Nagarjuna Birthday | టాలీవుడ్ కింగ్, గ్రీకువీరుడు నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదకగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) స్పెషల్ మ్యాష్అప్ వీడియోను వదిలింది. నాగార్జున ఇప్పటివరకు చేసిన సినిమాలతో పాటు అతడి ఐకానిక్ సినిమాలలోని డైలాగ్లను ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.