Kill Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్ (Kill Movie). బాలీవుడ్ యువ నటులు లక్ష్ లాల్వానీ (Lakshya),Kill Movie తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం జులై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని ఫైట్ సీన్స్‌కు అయితే ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయం అని చెప్పారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం తాజాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ విషయాన్ని డిస్నీ+హాట్ స్టార్ ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమిత్ రాఠోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కామాండోగా పని చేస్తుంటాడు. అతడి ప్రియురాలు తులికా (తన్య మనిక్తలా). అయితే పెళ్లి మాత్రం అమిత్‌ను చేసుకోవచ్చని.. తన తండ్రి మాట కాదనలేక వేరోకరితో నిశ్చితార్థం చేసుకుంటుంది తులికా. అయితే తులికాను తీసుకువెళ్లడానికి అమిత్ రాంచీకి వస్తాడు. ఈ క్రమంలోనే పెళ్లి అయిన ఒప్పించి చేసుకుందాం అప్పటివరకు వెయిట్ చేయమని అమిత్‌కు తులికా చెబుతుంది. దీనికి ఒకే చెబుతాడు అమిత్. అయితే ఎంగేజ్మెంట్ అనంతరం రాంచీ నుంచి ఢిల్లీ బయలుదేరుతుంది తులికా ఫ్యామిలీ. అమిత్ కూడా అదే ట్రైన్లో ఎక్కుతాడు. రాంచీ నుంచి ట్రైన్ ఢిల్లీకి వెళుతుండగా.. ఓ స్టేషన్లో రైలు ఆగడంతో దాదాపు 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. అయితే బందిపోట్లు ఎక్కిన అనంతరం ట్రైన్లో ఏం జరిగింది. బందిపోట్లు వలన తులికా ఫ్యామిలీకి ఎందుకు ఆపదా వస్తుంది.? ఎన్ఎస్జీ కమాండోగా ఉన్న అమిత్ ఏం చేస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ.