‘మహావీర నరసింహా’దారిలోనే రానున్న మరో ఇండియన్ యానిమేషన్ మూవీ ‘కికి అండ్ కొకొ’. పి.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధరణి నిర్మాత. కొకొ పాత్రకు బాలనటి శ్రీనిక డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై 9 భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
యానిమేషన్ సినిమాలంటే తనకెంతో ఇష్టమని, పెద్దయ్యాక మంచి నటిని కావడం తన లక్ష్యమని బాలనటి శ్రీనిక చెప్పారు. ఇలాంటి సినిమాల ద్వారా పిల్లలకు సంస్కారం అలవరుతుందని, సమాజానికి వినోదంతోపాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాతో ఇవ్వనున్నామని దర్శకుడు చెప్పారు. ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ గోకుల్ రాజ్ భాస్కర్, సీయీవో మీనా చాబ్రియా, నిర్మాత ధరణి కూడా మాట్లాడారు.