లాస్ ఏంజిల్స్: సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ (Oscar Awards). ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషన్ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగం వైభవంగా మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా కొనసాగుతున్నది. 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం బెస్ట్ పిక్చర్తో ముగియనుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నటి అమేలియా డిమోల్డెన్‌బర్గ్ వ్యవహిస్తున్నారు.
97వ ఆస్కార్ అవార్డులు..