Viral Vayyari Song | ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా.. ‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’ అనే పాట తెగ హల్చల్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లలో ఈ పాటని చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వయస్సు వారు తమదైన స్టైల్లో డ్యాన్స్‌లు చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇటీవలే కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థిని ఈ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ స్టైల్లో ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది హీరో కిరీటి రెడ్డి సమక్షంలో జరిగింది. డ్యాన్స్ చూసి ఆకర్షితులైన కిరీటి, తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ చిన్నారిని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఆమెకు ఒక చిన్న కానుక కూడా అందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
అదే పాటకు సీనియర్ నటి మణి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమతో కలిసి స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూనియర్ సినిమా వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 18న తెలుగు, కన్నడ భాషలలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది..
ముఖ్యంగా ‘వైరల్ వయ్యారి’ పాటకు యువత విపరీతంగా స్పందిస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, కిరీటి స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.ఈ పాటకు సంబంధించిన వీడియోలు, రీల్స్, షార్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చచేస్తుండగా, ఇవి చూసిన నెటిజన్స్ సంగీతానికి, డ్యాన్స్‌కి వయస్సు అడ్డుకాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari.
Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra
— Kireeti (@KireetiOfficial) July 23, 2025