రవితేజ కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది ‘కిక్’ చిత్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చక్కటి వినోదంతో పాటు కమర్షియల్ హంగులతో మెప్పించింది. అయితే ‘కిక్-2’ మాత్రం నిరాశపరచింది. తాజా సమాచారం ప్రకారం రవితేజతో సురేందర్ రెడ్డి మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమా విషయంలో రవితేజ కూడా సుముఖంగా ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఏజెంట్’ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి గ్యాప్ తీసుకున్నారు. కొందరు అగ్ర హీరోలకు కథలు వినిపించారు.
పవన్‌కల్యాణ్‌తో సినిమా దాదాపుగా ఓకే అయినట్లు తెలిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉంటే ఈలోగా రవితేజ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఏదిఏమైనా ‘కిక్’ కాంబినేషన్ రిపీట్ కావడం పట్ల రవితేజ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.